యూత్ స్టార్ సింగంలా బరిలోకి దిగుతాడట

Movie NewsYouth star enters the ring like a lion

యూత్ స్టార్ నితిన్ తన ప్రియురాలు శాలినిని వివాహం చేసుకున్న సంగతి
తెలిసిందే. ఈ లాక్ డౌన్ పీరియడ్ నితిన్ బ్యాచిలర్ షిప్ కి అలా చెక్
పెట్టేసింది. ఇక పెళ్లి తర్వాత నెక్ట్స్ ఏంటి? అంటే ఇప్పటికే పెండింగులో
ఉన్న సినిమాలన్నీ పూర్తి చేసి రిలీజ్ సవ్యంగా చూసుకోవడమే.

ప్రస్తుతం
వెంకీ అట్లూరి దర్శకత్వంలోని రొమాంటిక్ ఎంటర్ టైనర్ `రంగ్ దే` చిత్రీకరణను
తిరిగి ప్రారంభించేందుకు నితిన్ రెడీ అవుతున్నాడు. నాలుగైదు నెలల విరామం
తరువాత ఇప్పటికి క్లారిటీ రావడంతో సెప్టెంబర్ 23 నుండి హైదరాబాద్ ఔటర్
లో తిరిగి షూటింగ్ చేయనున్నారని తెలుస్తోంది. పెండింగ్ చిత్రీకరణ అంతా
లోకల్ గానే పూర్తి చేస్తారు. అటుపై టాకీ పార్ట్తో పాటు కొన్ని పాటలను
యూరప్ లో చిత్రీకరిస్తారు.

ఇప్పటికే జీ 5 లో స్ట్రీమింగ్ కి
ఒప్పందం కుదిరిందని గుసగుసలు వినిపిస్తుండగా.. అందుకు నితిన్
అంగీకరించారా లేదా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ముప్పయి శాతం
ప్రస్తుతం పెండింగ్ షూట్ ఉంది. అది వేగంగా పూర్తి చేయనున్నారు. ఇందులో
కీర్తి సురేష్ కథానాయిక. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సితారా
ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ రంగ్ నిర్మిస్తున్నారు.
నితిన్ `రంగ్ దే` పెండింగ్ షూట్ పూర్తి చేసి తదుపరి చంద్రశేఖర్ యెలేటి
సినిమా సహా కృష్ణ చైతన్యతో సినిమా విషయమై ఆలోచించనున్నారని
సమాచారం.Source link

www.tupaki.com

Leave a Reply