రవితేజ ‘RT67’ నుంచి మరో సర్ప్రైజింగ్ పోస్టర్…!

Movie NewsAnother Surprising  Poster From RT67

మాస్ మహారాజా రవితేజ – డైరెక్టర్ రమేష్ వర్మ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘రాక్షసుడు’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన రమేష్ వర్మ రూపొందించనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ను హవీష్ ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. ఏ స్టూడియోస్ మరియు బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. రవితేజ కెరీర్లో 67వ చిత్రంగా రానున్న ఈ మూవీకి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ క్రమంలో లేటెస్టుగా ‘వన్ స్టెప్ క్లోజర్’ అంటూ మరో న్యూ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేశారు.

కాగా ‘RT67’ ప్రీ లుక్ పోస్టర్ లో స్టైలిష్ గా డాన్స్ చేస్తున్నట్లున్న రవితేజ షాడో ఇమేజ్ ని చూపించిన చిత్ర యూనిట్.. ఇప్పుడు తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో స్టైలిష్ గా నడుస్తున్న రవితేజ కాళ్ళను చూపించారు. రోడ్ మీద స్టైల్ గా రవితేజ నడుస్తూ వస్తుంటే కరెన్సీ నోట్లు ఎగిరి పడుతున్నట్లుగా ఈ పోస్టర్ ని డిజైన్ చేశారు. ఈ మూవీ ముహూర్తం వేడుక రేపు(ఆదివారం) జరగనున్నది. అదే రోజు ఉదయం 11:55 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇంకా సినిమా స్టార్ట్ కాకముందే ప్రచార చిత్రాలతో ఈ ప్రాజెక్ట్ పై పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది. ఈ చిత్రంలో రవితేజ సరసన యంగ్ బ్యూటీస్ మీనాక్షి చౌదరి మరియు డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించనున్నారు. త్వరలోనే ‘RT67’ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.Source link

www.tupaki.com

Leave a Reply