రాజమౌళి అలాంటి డేరింగ్ డెసిషన్ తీసుకోబోతున్నాడా…?rajamouli wants cut few songs from rrr script

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్.ఆర్.ఆర్’ (రౌద్రం రణం రుధిరం). యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో రామ్ చరణ్ ‘మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’గా కనిపిస్తుండగా తారక్ ‘కొమరం భీమ్’ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. యావత్ సినీ అభిమానులు ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.

ఇప్పటికే రెండు సార్లు విడుదల తేదీలను మార్చుకున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఆ డేట్ కి రావడం కష్టమే అని తెలుస్తోంది. ఇప్పటికే నాలుగు నెలల సమయం వృధాగా పోయింది. మళ్ళీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘ఆర్.ఆర్.ఆర్’ మిగతా షూటింగ్ మాత్రం ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చెప్పలేని సిచ్యుయేషన్. రోజురోజుకి కరోనా తీవ్ర రూపం దాల్చుతుండటంతో రిస్క్ తీసుకొని షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచన విరమించుకున్నారట.

అంతేకాకుండా మిగతా 30 శాతం షూటింగ్ పార్ట్ కూడా ట్రిమ్ చేయాలని ఆలోచిస్తున్నారట. దీంతో పాటు సినిమాలో కొన్ని సాంగ్స్ కూడా తీసేయాలనే ఆలోచన చేస్తున్నారట. కథలో భాగం కాని పాటలను తీసేసినా ఇబ్బంది ఉండదని.. అందులోనూ తక్కువ సమయంలో షూటింగ్ కంప్లీట్ చేయొచ్చనే అభిప్రాయంలో ఉన్నారట. రాజమౌళి తన సినిమాల్లో సాంగ్స్ ని స్పెషల్ గా డిజైన్ చేస్తారన్న విషయం తెలిసిందే. ఇదే కనుక జరిగితే రాజమౌళి నుంచి ఎక్కువ సాంగ్స్ ఎక్ష్పెక్త్ చేసే సినీ అభిమానులు డిజప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. మరి జక్కన్న అలాంటి డేరింగ్ డెసిషన్ తీసుకోబోతున్నాడా లేదా అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే.Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *