రాబోయే రోజుల్లో డిజిటల్ వార్స్ పవన్ Vs మహేష్Digital Wars Pawan vs Mahesh in the coming days

గతంలో హీరోల అభిమానుల మధ్య సంభాషణలు.. చర్చలు.. పోటీలు అన్నీ బయట రియల్ గా
జరిగేవి కానీ ఇప్పుడు అదంతా సోషల్ మీడియాకు షిఫ్ట్ అయింది. జస్ట్ తమ హీరోను
సపోర్ట్ చేసుకోవడమే కాకుండా ఇతర హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు
చర్చల్లో పాల్గొనడం లాంటివి చేస్తుంటారు. ఒక్కోసారి ఈ చర్చలు హద్దులు కూడా
దాటుతుంటాయి.  పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో సోషల్ మీడియా
యాక్టివిటీలో ప్రధానంగా మహేష్ బాబు మిగతా హీరోల కంటే ముందంజలో ఉన్నారని
అంటున్నారు.

తమ హీరోకు అన్ని విషయాల్లో మద్దతుగా నిలవడం.. యాంటి
ఫ్యాన్స్ చేసే ప్రచారాలకు దీటుగా బదులివ్వడం లాంటివి చేస్తూ యాక్టివ్ గా
ఉన్నారు.  అయితే మహేష్ ఫాన్స్  లాగానే పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ఆర్మీ
కూడా పెద్దది.  రాజకీయాల్లో ఈ సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ పెద్దగా
ఉపయోగపడలేదు కానీ సినిమాల విషయంలో మాత్రం యూజ్ అవుతుందనే అభిప్రాయాలు
ఉన్నాయి.  ఈమధ్య 8 ఇయర్స్ అఫ్ గబ్బర్ సింగ్ ట్రెండింగ్ కావడంలో పవన్
ఫ్యాన్స్ పాత్ర చాలా కీలకంగా నిలిచింది. దీంతో రాబోయే రోజుల్లో పవన్..
మహేష్ బాబు అభిమానుల హవా సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటుందనే అంచనాలు
ఉన్నాయి.  ఇది పోటీగా మారే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు.

తమిళ
స్టార్ హీరోలలో  విజయ్.. అజిత్ అభిమానుల హంగామా సోషల్ మీడియాలో ఎక్కువగా
కనిపిస్తూ ఉంటుంది. తమ హీరోలకు సంబంధించిన హ్యాష్ టాగ్స్ ను దేశవ్యాప్తంగా
ట్రెండింగ్ చేయడంలో వారు చాలా పట్టుదలగా ఉంటారు. ఈమధ్య టాలీవుడ్ స్టార్
హీరోల అభిమానులు కూడా ఇదే ధోరణి కనబరుస్తున్నారు. ఈ విషయంలో మిగతా హీరోల
కంటే మహేష్ పవన్ కళ్యాణ్ అభిమానుల సందడి ఎక్కువగా ఉందట. ఈ ఇద్దరి తర్వాత
అల్లు అర్జున్ ఫ్యాన్స్ హవా సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.  

ప్రజలు
కూడా సంప్రదాయ మీడియానుంచి డిజిటల్ మీడియాకు స్లోగా మారుతూ ఉండడంతో
చాలామంది హీరోలు సోషల్ మీడియాలో తమ అభిమానులు యాక్టివ్ గా ఉండేలా చర్యలు
కూడా తీసుకుంటున్నారట. కొందరైతే ఇందుకోసం ప్రత్యేకంగా టీమ్స్ ను ఏర్పాటు
చేసే అలోచనలో ఉన్నారట.Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *