రెంటికీ చెడ్డ స్టార్ డైరెక్టర్



రెంటికీ చెడ్డ స్టార్ డైరెక్టర్

వి.వి.వినాయక్.. పదేళ్ల కిందట ఈ దర్శకుడికి ఏ స్థాయిలో క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ టాప్ స్టార్లు ఆయనతో పని చేయడానికి లైన్లో ఉండేవాళ్లు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి బడా బడా స్టార్లతో ఆయన సినిమాలు చేశాడు. మూడేళ్ల ముందు కూడా మెగాస్టార్‌తో ‘ఖైదీ నంబర్ 150’ సినిమాను రూపొందించాడు. కానీ ఆయన వైభవానికి ఆ సినిమాతో తెరపడింది.

‘ఇంటిలిజెంట్’ అనే ఒక్క సినిమా వినాయక్ కెరీర్‌ను కూల్చేసింది. వినాయక్‌పై ఔట్ డేటెడ్ ముద్ర వేసి అవకాశాలు లేకుండా చేసేసింది ఆ చిత్రం. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా చేసేందుకు ప్రయత్నించి ఫెయిలయ్యాడు. ఇంతలో ఎవ్వరూ ఊహించని విధంగా వినాయక్‌కు హీరోగా నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమానే.. సీనయ్య.

తనకు నిర్మాతగా లైఫ్ ఇచ్చిన వినాయక్ కోసం ఈ సినిమాను లైన్లో పెట్టాడు దిల్ రాజు. ఇంతకుముందు ‘శరభ’ అనే సినిమా తీసిన నరసింహారావు ఈ చిత్రానికి దర్శకుడు. షూటింగ్ మొదలుపెట్టారు. ఒకట్రెండు షెడ్యూళ్లు అయ్యాయి. కానీ ఆ తర్వాత సినిమాకు బ్రేక్ పడింది.

వినాయక్‌‌ను హీరోగా చూడటానికి మామూలుగానే జనాలు థియేటర్లకు రావడం కష్టం. అలాంటిది ఔట్ పుట్ కూడా అనుకున్నంతగా లేదని రాజు భావించాడు. ఈ సినిమాను హోల్డ్ చేశాడు. ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా నిర్మాతల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో ‘సీనయ్య’ సినిమాను ముందుకు తీసుకెళ్లడం ఏమాత్రం మంచిది కాదని భావించిన రాజు.. దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్లు తెలస్తోంది.

హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసం వినాయక్ కొన్ని నెలల పాటు కష్టపడ్డాడు. దర్శకత్వ ఆలోచనల్ని ఏడాది కిందటే పక్కన పెట్టేశాడు. ఆ దిశగా ప్రయత్నాలన్నీ ఆగిపోయాయి. ఇటు చూస్తే హీరోగా చేస్తున్న సినిమా ఆగిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో వినాయక్‌కు దర్శకుడిగా ఎవరూ ఛాన్సులిచ్చేలా లేరు. దీంతో ఇప్పుడాయన పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.



Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *