లక్కీ బ్యూటీ నటిస్తే కన్నడ ఫ్లేవర్ తెలుగు జనాలకు ఎక్కుతుందా…?

Movie NewsCan Rashmika's Craze Work In Favour Of This Kannada Film?

కన్నడ సినిమా సత్తా ఏంటో ఇతర సినీ ఇండస్ట్రీలకు చూపించింది ‘కేజీఎఫ్’. అప్పటి వరకు కర్ణాటక బార్డర్ దాటని కన్నడ సినిమా.. ‘కేజీఎఫ్’ వల్ల తెలుగు తమిళం మలయాళం హిందీ భాషలలో కూడా సూపర్ సక్సెస్ అందుకొని ‘కన్నడ బాహుబలి’ అనిపించుకుంది. దీంతో ఇప్పుడు శాండిల్ వుడ్ మేకర్స్ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేయడానికి ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో ‘యాక్షన్ కింగ్’ అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ”పొగరు”ని ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ చిత్రానికి నందకిశోర్ దర్శకత్వం వహించగా శ్రీ జగద్గురు మూవీస్ బ్యానర్ పై బి.కె. గంగాధర్ నిర్మించారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో కూడా అదే పేరుతో విడుదల చేస్తున్నారు.

కాగా రష్మిక మందన్న క్రేజ్ ని నమ్ముకునే ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకొస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. తెలుగులో రష్మిక ఇప్పుడు స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. వరుసగా క్రేజీ ఆఫర్స్ దక్కించుకోవడంతో పాటు సక్సెస్ లు కూడా అందుకుంటోంది. అయితే ఛాంబర్ లో ఈ సినిమా పై రెండు రకాలు టాక్స్ వినిపిస్తున్నాయి. ఎంత రష్మిక యాక్ట్ చేసినా కన్నడ ఫ్లేవర్ తెలుగు జనాలకు ఏ మాత్రం ఎక్కేలా లేదనే కామెంట్స్ వస్తున్నాయి. అయితే మరికొందరు మాత్రం కేజీఎఫ్’ ని కూడా తక్కువ అంచనా వేస్తే అది ఏ స్థాయి బ్లాక్ బస్టర్ అయిందో అందరికి తెలిసిందే కదా.. ‘పొగరు’ సినిమా నుండి ఒక వీడియో సాంగ్ రిలీజ్ చేస్తే 5 రోజుల్లో 11 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది.. దీనిని బట్టి చూస్తే టాలీవుడ్ లో కూడా ఈ సినిమాకి ఆదరణ దక్కే అవకాశం ఉందని కామెంట్స్ చేస్తున్నారు. కాకపోతే ‘కేజీఎఫ్’ యూనివర్సల్ కాన్సెప్ట్ అవడం వల్ల తెలుగు ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ అయ్యారు.. అయితే మరి ఇప్పుడు ‘పొగరు’ ని కూడా తెలుగు ఆడియన్స్ అలానే రిసీవ్ చేసుకుంటారా అనేది చూడాలి.Source link

Leave a Reply