విజయ్ సినిమా కోసం ఎన్టీఆర్ పాడబోతున్నాడా?



విజయ్ సినిమా కోసం ఎన్టీఆర్ పాడబోతున్నాడా?

టాలీవుడ్ హీరోల్లో బహుముఖ ప్రజ్ఞ ఉన్న వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. అతడికున్న అనేక ప్రతిభల్లో గానం కూడా ఒకటి. వాయిస్ కొంచెం రఫ్‌గా అనిపించినా సరే.. ఎన్టీఆర్ అప్పుడప్పడూ పాటలు పాడుతుండటాడు. తొలిసారిగా ‘యమదొంగ’ కోసం కీరవాణి సంగీత నిర్దేశకత్వంలో ‘ఓలమ్మీ తిక్క రేగిందా’ అంటూ ఓ పాట అందుకున్నాడు తారక్. కానీ అందులో అతడి గొంతు అంత శ్రావ్యంగా ఏమీ అనిపించదు.

కానీ ‘కంత్రి’ సినిమా కోసం మణిశర్మ సంగీత దర్శకత్వంలో పాడిన టైటిల్‌ సాంగ్‌కు మాత్రం మంచి స్పందనే వచ్చింది. ఆ తర్వాత తమన్ అతడితో ‘రభస’ సినిమాకు రాకాసి రాకాసి పాట పాడితే.. అది కూడా హిట్టయింది. ఆపై ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ‘ఐ వానా ఫాలో ఫాలో..’ అంటూ మరో పాట అందుకున్నాడు. అది తారక్ పాటల్లో ది బెస్ట్‌గా నిలిచింది. ఆపై తన సినిమాలకు ఎప్పుడూ పాట పాడుకోని తారక్.. ఓ కన్నడ సినిమా కోసం గొంతు సవరించుకోవడం విశేషం.

పునీత్ రాజ్ కుమార్ నటించిన ఓ సినిమా కోసం ‘గెలయా గెలయా’ అంటూ ఓ మంచి పాట పాడాడు తారక్. దానికి తమనే సంగీత దర్శకుడు. మళ్లీ తారక్‌తో ఎవరూ పాటలు పాడించే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు తారక్ మరోసారి బయటి సినిమా కోసం పాట పాడబోతున్నాడన్నది తాజా సమాచారం. తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘మాస్టర్’ కోసం అతణ్ని పాట పాడమని అడుగుతున్నాడట సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. ఈ సినిమా నుంచి తమిళంలో ఒరు కుట్టి స్టోరీ అంటూ ఓ పాట రిలీజ్ చేశారు.

అనిరుధ్‌కు తొలిసారి మంచి పేరు తెచ్చిన ‘కొలవరి’ స్టయిల్లో ఈ పాట సాగింది. తమిళంలో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ పాటను తెలుగులో ఎన్టీఆర్‌తో పాడించాలనుకుంటున్నారట. ‘మాస్టర్’ను తెలుగులో రిలీజ్ చేస్తున్నది ఎన్టీఆర్ సన్నిహితుడైన పీఆర్వో టర్న్డ్ ప్రొడ్యూసర్ మహేష్ కోనేరునే కావడంతో తారక్‌ను ఒప్పించడం పెద్ద కష్టం కాకపోవచ్చు.



Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *