వీడియో : పిల్లల విషయంలో చై సామ్ ముచ్చట్లు

Movie NewsVideo: Chai Sam's charms about children

టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ క్యూట్ కపుల్ ఎవరు అంటే ఠక్కున వినిపించే
పేర్లలో ముందు ఉండే పేర్లు నాగచైతన్య మరియు సమంత అనడంలో ఎలాంటి సందేహం
లేదు. సుదీర్ఘ కాలం పాటు ప్రేమించుకుని రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈ
జంట ఎప్పుడెప్పుడు తల్లిదండ్రులు అవుతారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు
చూస్తున్నారు. సమంతను ఎంతో మంది ఎన్నో సార్లు తల్లి ఎప్పుడు కాబోతున్నారు
అంటూ ప్రశ్నించారు. ఒకానొక సమయంలో సమంత గర్బవతి అనే పుకార్లు కూడా షికార్లు
చేశాయి. ఇలాంటి సమయంలో తాజాగా వచ్చిన ఒక కమర్షియల్ యాడ్ మళ్లీ వీరి
పిల్లల విషయమై చర్చ జరిగేలా చేసింది.

వీరిద్దరు కలిసి మింత్ర యాడ్
లో నటించారు. యాడ్ లో భాగంగా మింత్ర లో చైతూ నాన్నకు కుర్తా.. తమ్ముడికి
స్టైలిష్ డ్రస్.. అమ్మకు చీర అంటూ ఎంపిక చేస్తుండగా ఫోన్ ను సమంత
తీసుకుని పిల్లల సెక్షన్ కు వెళ్లి ఈ డ్రస్ చూడండి ఎంత క్యూట్ గా ఉందో
అంటూ సిగ్గు పడుతూ ఉండగా అలాంటి ఆలోచన ఇప్పుడేం పెట్టుకోకు అంటూ చైతూ అనడం
సమంత ఎందుకు అలా అంటూ అతడిని రెచ్చ గొట్టినట్లుగా చూడటం రొమాంటిక్ గా
సాగింది.Source link

www.tupaki.com