వెయ్యి క్రష్ లు దాటేశాడట ఆ హీరో..

Movie NewsThe Hero Having Thousand Crushes

సినిమా హీరో హీరోయిన్లకు సంబంధించిన ఇంటర్వ్యూ అన్నంతనే.. చాలా గంభీరంగా ఉండే ప్రశ్నలు వేయటం.. దానికి పొందిగ్గా సమాధానం చెప్పటం ఉండేది. ఇప్పుడు సీన్ కాస్త మారింది. గతంలో పోలిస్తే.. నటీనటులు కాస్త ఓపెన్ అవుతున్నారు. సరదాగా మాట్లాడుతున్నారు. గతంలో ఏం మాట్లాడితే ఏమవుతుందన్న స్థానే.. చాలా విషయాల్ని సింఫుల్ గా..  ఈజీగా ఉండేలా.. ఫన్నీగా తేల్చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యూత్ స్టార్ నితిన్ తనకు సంబంధించిన ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చాడు.

అతడు నటించిన భీష్మ మూవీ విడుదల కానున్న వేళ.. ఆ సినిమా ప్రమోషన్ వర్క్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా క్రష్ ల గురించి ప్రస్తావన వచ్చింది. మీ క్రష్ లు వంద దాటాయా? అని యాంకర్ అడిగితే.. వందేంది? వెయ్యి దాటేసి ఉంటాయని నిజాన్ని ఒప్పేసుకున్నారు నితిన్. హైక్లాస్ నుంచి లో క్లాస్ వరకూ నా క్రష్ లే వందల్లో ఉంటాయి. ఎవరైనా అమ్మాయి కనిపించినంతనే బాగుందని అనుకుంటాం కదా.. అదే క్రష్. అలాంటివి నా లైఫ్ లో వెయ్యికి పైనే ఉన్నాయని చెప్పేసి ఆశ్చర్యానికి గురి చేశాడు.

మరి.. మీ మాటేమిటన్నప్పుడు రష్మిక మాత్రం నితిన్ మాదిరి ఓపెన్ కాలేదు. తనకంత సీన్ లేదని సిగ్గు పడింది. దీంతో చొరవ తీసుకున్న నితిన్.. ఫర్లేదులే చెప్పు. నిజానికి నీలోనే ప్రాబ్లం ఉంది.. లేకపోతే అమ్మాయిలంటే ఇష్టమా? అబ్బాయిలంటే ఇష్టం లేదంటున్నావ్ అని అటపట్టించటంతో.. తనకు అబ్బాయిలంటేనే ఇష్టమని చెప్పింది.

తాను సెలెక్టివ్ గా ఉంటానని.. క్రష్ అనిపించేంతలా ఎవరూ తనకు తగ్గట్లేదని.. తన చిన్నతనంలో మాత్రం దళపతి విజయ్ అంటే క్రష్ ఉండేదని చెప్పింది. క్రష్ టాపిక్ మీద నితిన్ వెంటనే ఓపెన్ అయితే.. రష్మిక మాత్రం ఆచితూచి అన్నట్లుగా రియాక్ట్ కావటం గమనార్హం.Source link

Leave a Reply