వేలెంటైన్స్ రోజునే బయట పెట్టాలా!

Movie NewsShriya Saran Selfie with His Husband

సౌత్ లో దాదాపు రెండు దశాబ్ధాల కెరీర్ జర్నీ సాగించింది అందాల శ్రీయ. ఇష్టం సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈ భామ ఇప్పటికీ అదే స్లిమ్ ఫిట్ లుక్ ని మెయింటెయిన్ చేస్తోంది. 2018లో ప్రియుడు ఆండ్రూ కోస్చీవ్ ను పెళ్లాడిన ఈ భామ కెరీర్ ని ఫ్యామిలీ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఫుల్ గా అస్వాధిస్తోంది. భర్తతో ఉన్న ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ విదేశీ విహారాల్లో నిరంతరం బిజీబిజీగా ఉంటోంది. ఇంతకుముందు విదేశీ వెకేషన్ లో ఫుల్ గా చిందేస్తున్న ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి.

ఆ తర్వాత దీపావళి వేడుకల కోసం ఆండ్రూ కోశ్చీవ్ ముంబైలో అడుగుపెట్టినప్పుడు తనతో కలిసి దిగిన ఫోటోల్ని శ్రీయ సోషల్ మీడియాలో షేర్ చేసింది. నిర్మాత రమేష్ తురానీ ముంబైలో తన ఇంట్లోనే దీపావళి వేడుకలు నిర్వహిస్తే అక్కడికి శ్రీయ స్పెషల్ గెస్ట్ గా ఎటెండైంది. ఈ వేడుకకు తన భర్తతో కలిసి వచ్చింది శ్రీయ. పార్టీలోని శ్రీయ- ఆండ్రూ జంట ఫోటోలు సోషల్ మీడియాల్లో వైరల్ అయ్యాయి. ఇక ఇవే ఫోటోల్లో హబ్బీకి ఘాటైన చుమ్మా ఇచ్చి పెద్ద షాకిచ్చింది. ఆ సందర్భంలోనే కాదు పలుమార్లు పబ్లిక్ వేదికలపైనే ఆండ్రూకి లిప్ లాక్ వేసి పలుమార్లు ఆశ్చర్యపరిచింది శ్రీయ.

ఇక తన ఫ్యామిలీ లైఫ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోల్ని ఈ అమ్మడు అడపాదడపా షేర్ చేస్తూ ఉన్నా.. ఇటీవలి కాలంలో మాత్రం ఆండ్రూతో కలిసి ఉన్న ఫోటోలు కనిపించడం లేదు. శ్రీయ సోలో ఫోటోలే ఎక్కువ వైరల్ అవుతున్నాయి. కట్ చేస్తే ఇదిగో ప్రేమికులరోజును పురస్కరించుకుని ఆండ్రూతో పెళ్లి నాటి సరిగమలకు సంబంధించిన ఓ ఫోటోని నేడు షేర్ చేసింది. లవ్ యు ఫరెవర్.. అండ్ ఎవ్వర్.. అంటూ వ్యాఖ్యను జోడించింది. ఈ ఫోటోలో శ్రీయ స్మైలీ ఎక్స్ ప్రెషన్.. తననే ఆత్రంగా చూస్తున్న ఆండ్రూ అమాయకత్వం.. సంథింగ్ స్పెషల్ గా హైలైట్ అయ్యింది. ఇక ఇంత గ్యాప్ తర్వాత ఇప్పుడే ఈ ఫోటోని శ్రీయ ఎందుకు షేర్ చేసింది? అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆండ్రూ నుంచి ప్రేమికులరోజు గిఫ్ట్ అందిందా లేదా? అన్నదానికి క్లారిటీ లేదు మరి.Source link

Leave a Reply