శంకర్ ఒక్కడికే కాదు.. గత ప్రమాదాలు ఇలాగే!10 horrific deaths at Chennai EVP Studios in 10 years

భారతీయుడు 2 (ఇండియన్-2) సెట్స్ లో క్రేన్ కూలిన ప్రమాదంలో ముగ్గురు
దుర్మరణం పాలై పది మంది గాయపడిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ –
కాజల్ ఈ ప్రమాదం నుంచి తృటి లో తప్పించు కోవడంతో అందరూ ఊపిరి
పీల్చుకున్నారు. ఊహించని ఈ దుర్ఘటనతో కోలీవుడ్ సహా అన్ని పరిశ్రమలు
ఉలిక్కి పడ్డాయి. ఈ ఘటన పై లైకా ప్రొడక్షన్స్ సుభాష్కరణ్..
కమల్ హాసన్.. శంకర్ ఎంతో ఆవేదనను వ్యక్తం చేశారు. తమతో కలిసి
పనిచేసిన ఆ ముగ్గురు తిరిగిరాని లోకాలకు వెళ్లి పోవడంతో తీవ్ర
మనస్తాపానికి గురయ్యారు. ఆ ముగ్గురి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం
చేయడానికి ముందుకొచ్చారు.

లైకా ప్రొడక్షన్స్ 2 కోట్లు.. కమల్
హాసన్ కోటి రూపాయాలు బాధిత కుటుంబాలకు విరాళంగా ప్రకటించారు. తమ బాధ
కన్నా ఆ కుటుంబ సభ్యుల్లో విషాదం వర్ణనాతీతం అని కమల్ తీవ్ర
మనస్తాపానికి గురయ్యారు. ప్రస్తుతం చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి
ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా లైకా
ప్రొడక్షన్స్ పైనా… జెయింట్ క్రేన్ యజమానిపైనా.. ప్రొడక్షన్
మేనేజర్ పైనా కేసులు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసు
విచారణ లో భాగంగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు
తెలుస్తోంది. సరిగ్గా ఈ ప్రమాదం చెన్నైలో ని ఈవీపీ ఫిల్మ్ సిటీలో
జరిగింది.

అయితే ఈ ఫిల్మ్ సిటీలో ఇదొక్కటే తొలి ఘటన కాదు.
గతం లో `కాలా`..` బిగిల్` సినిమా షూటింగ్ సమయంలోనూ ఇలాంటి ప్రమాదాలు
జరిగాయి. అలాగే `బిగ్ బాస్-2 రియాల్టీ షోకు అవసరమైన సెట్స్
వేస్తున్నప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని సమాచారం. అందుకే
పోలీసులు ఆ స్థలాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారుట. ప్రమాదాలకు కారణం
క్రేన్ లో సాంకేతిక లోపమా? లేక స్థలం సెట్స్ వేసుకోవడానికి అనువుగా లేక
ప్రమాదాలు జరుగుతున్నాయా? అన్నది.. అన్ని కోణాల్లో దర్యాప్తు
చేస్తున్నారని తెలుస్తోంది.Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *