శ్రావణి కేసు రిమాండ్ రిపోర్ట్: నిర్మాత అశోక్ రెడ్డి అరెస్ట్?

Movie NewsTV actress Sravani suicide case

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆమె ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ఎక్స్ 100 సినిమా నిర్మాత అశోక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అతడిని రిమాండ్ కు పంపనున్నట్టు సమాచారం.

మరోవైపు ఈ కేసులో రిమాండ్ రిపోర్టును రెడీ చేసిన పోలీసులు దేవరాజ్ రెడ్డిని ఏ1గా.. సాయిరెడ్డిని ఏ2గా.. అశోక్ రెడ్డిని ఏ3గా చేర్చారు. శ్రావణి తల్లిదండ్రులను నిందితులుగా చేర్చడం కుదరదని డీసీపీ తెలిపారు.

శ్రావణి సూసైడ్ తర్వాత నిర్మాత అశోక్ రెడ్డి పరారీలో ఉన్నాడు. ఆయన మాట్లాడిన మాటలు.. లోకేషన్ ట్రేస్ చేసి పోలీసులు పట్టుకున్నట్టు సమాచారం.

సినిమాల్లో అవకాశాల పేరుతో శ్రావణితో అశోక్ రెడ్డి దగ్గరైనట్టు పోలీసులు గుర్తించారు. మధ్యలో దేవరాజ్ రావడంతో అశోక్ రెడ్డి తట్టుకోలేక సాయిరెడ్డితో కలిసి అతడిని దూరం చేసే కుట్ర చేశాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో రాసినట్టు సమాచారం. ఓ హోటల్ వద్ద శ్రావణి దేవరాజ్ తో గొడవ అనంతరం సాయికృష్ణ ఆమెను ఇంటికి తీసుకెళ్లి దాడి చేశారని తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు రోజు జరిగిన ఈ గొడవకు కారణం అశోక్ రెడ్డి అని పోలీసులు ఆధారాలు సేకరించినట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. రిమాండ్ రిపోర్టులో శ్రావణి ఆత్మహత్యకు కారణంగా అశోక్ రెడ్డిని చేర్చినట్టుగా ప్రచారం సాగుతోంది.Source link

www.tupaki.com

Leave a Reply