సంక్రాంతికి వకీల్ సాబ్ రావడం పక్కా

Movie NewsIs Dil Raju Planning A Sankranti season For Vakeel Saab?

అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ రాజకీయాల కారణంగా దాదాపు రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు. సినిమాలకు పవన్ పూర్తిగా గుడ్ బై చెప్పినట్లే అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా మూడు సినిమాలను పవన్ ప్రకటించి అందరిని ఆశ్చర్యపర్చాడు. మొదటగా బాలీవుడ్ హిట్ మూవీ ‘పింక్’ ను రీమేక్ చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఆ సినిమా రూపొందుతుంది. సినిమాను సమ్మర్లోనే విడుదల చేయాలనుకుంటే కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ఇంకా షూటింగ్ దాదాపు నెల రోజులు బ్యాలన్స్ ఉంది. షూటింగ్ ను నవంబర్ మరియు డిసెంబర్ లో పూర్తి చేయాలని భావిస్తున్నారు.

ఇటీవలే దర్శకుడు వేణు శ్రీరామ్ సినిమాను డిసెంబర్ వరకు పూర్తి చేయాలని నిర్ణయించాం. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటగా పవన్ కళ్యాణ్ లేని సీన్స్ ను షూటింగ్ చేసి ఆ తర్వాత పవన్ కాంబో సీన్స్ ను షూట్ చేస్తారట. షూటింగ్ ను చాలా స్పీడ్ గా తక్కువ సమయంలో తక్కువ కాస్ట్ అండ్ క్రూ సమక్షంలో చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.

ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ఖచ్చితంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. అప్పటి వరకు థియేటర్లకు జనాలు క్యూ కట్టడం ఖాయం అంటున్నారు. కరోనా వ్యాక్సిన్ వస్తుందని చాలా నమ్మకంగా ఉన్నారట. అందుకే దిల్ రాజు జనవరి 14 అంటూ డేట్ కూడా ఫిక్స్ అయ్యాడు అంటూ సమాచారం అందుతోంది. అతి త్వరలోనే సినిమా విడుదల తేదీపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. ఈ సినిమాలో శృతి హాసన్ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.Source link

www.tupaki.com

Leave a Reply