సంక్రాంతి జాబితా పెరిగి పోతుంది

Movie NewsSankranthi Movie Releases Updates

థియేటర్ల ఓపెన్ కు గ్రీన్ సిగ్నల్ రావడంతో వెంటనే కాకున్నా వచ్చే నెల నుండి అయినా పూర్తి స్తాయిలో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉంది. దాంతో క్రిస్మస్ నుండి వరుసగా సినిమాలను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు క్రిస్మస్ కానుకగా రాబోతున్నట్లుగా ప్రకటన ఇచ్చాయి. ఇక కొన్ని సినిమాలను సంక్రాంతి రేసులో తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఖచ్చితంగా సంక్రాంతి రేసులో ఉంటుందని అంటున్నారు. కాని ఆ విషయం పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాని ఇతర సినిమాలు మాత్రం సంక్రాంతి రిలీజ్ అంటూ క్లీయర్ గా క్లారిటీ ఇస్తున్నాయి.

రామ్ హీరోగా నటించిన ‘రెడ్’.. కేజీఎఫ్.. అఖిల్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ మరియు రవితేజ క్రాక్ సినిమా కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అధికారికంగా ప్రకటన వచ్చిన సినిమాలు మాత్రమే కాకుండా మరికొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సందర్బంగా సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా గోపీచంద్ నటిస్తున్న సిటీమార్ సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేస్తాం అంటూ మేకర్స్ అంటున్నారు. అయితే ఇప్పటి వరకు వారు అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే సిటీమార్ సినిమా షూటింగ్ పూర్తి చేయబోతున్నారు.

గోపీచంద్ మరియు తమన్నా జంటగా నటించిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. కనుక సంక్రాంతికి విడుదల చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట. అందుకే కాస్త పోటీ ఎక్కువ ఉన్నా కూడా చాలా గ్యాప్ తర్వాత సినిమాలు విడుదల కాబోతున్నాయి కనుక ప్రేక్షకులు క్యూ కట్టే అవకాశం ఉందని పలు సినిమాలు విడుదలకు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే కన్ఫర్మ్ అయిన సినిమాలు కాకుండా మరిన్ని సినిమాలు కూడా సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెలలో విడుదల విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.Source link

www.tupaki.com