‘సాహో’ హిందీ టీవీ ప్రీమియర్ కు రికార్డ్ స్థాయి రేటింగ్

Movie NewsSaaho sets records In Bollywood Tv Premiere

ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో చిత్రంను తెలుగు
ప్రేక్షకులు అంతగా ఆధరించలేదు కాని బాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం
పట్టారు. అక్కడ భారీ స్థాయిలో వసూళ్లు నమోదు అయిన విషయం తెల్సిందే. తెలుగు
ప్రేక్షకులు పెదవి విరిచిన ఈ భారీ యాక్షన్ డ్రామాకు హిందీ ప్రేక్షకులు ఓ
రేంజ్ లో సాహో అంటున్నారు. కలెక్షన్స్ విషయంలోనే కాకుండా అమెజాన్ మరియు
నెట్ ప్లిక్స్ లో స్ట్రీమ్ అయిన సమయంలో హిందీ ప్రేక్షకులు ఈ సినిమా యమ
చూశారు.

తాజాగా రిపబ్లిక్ డే సందర్బంగా జీ సినిమా ఛానెల్ లో జనవరి
26న వరల్డ్ టీవీ ప్రీమియర్ వేయడం జరిగింది. అనూహ్యంగా ఈ చిత్రానికి భారీ
స్పందన వచ్చింది. టీవీల్లో కూడా ఈ సినిమాను తెగ చూశారు. 2020 నాల్గవ
వారంలో రేటింగ్ విషయంలో సాహో మొదటి స్థానం లో నిలిచింది. ఈ ఏడాది లో
ఇప్పటి వరకు సాహోనే టాప్ ప్లేస్ లో నిలిచింది. ప్రభాస్ ను హిందీ
ప్రేక్షకులు ఏ విధంగా అభిమానిస్తున్నారో ఈ రేటింగ్ ను చూస్తుంటే అర్థం
అవుతుంది.

సాహో చిత్రం థియేటర్ల లో.. ఓటీటీ ప్లాట్ ఫామ్ పై చూసి
కూడా మళ్లీ చాలా మంది ప్రేక్షకులు జీ సినిమా ఛానెల్ లో చూసేందుకు ఆసక్తి
చూపడం వల్లే ఈ స్థాయి రేటింగ్ నమోదు అయ్యిందని విశ్లేషకులు అభిప్రాయం
వ్యక్తం చేస్తున్నారు. సాహో చిత్రంతో ప్రభాస్ బాలీవుడ్ లో తన స్థానంను
మరింత పదిలం చేసుకున్నాడు. బాలీవుడ్ సినిమాలకు పోటీగా నిలిచి సాహో మొదటి
స్థానం ను దక్కించుకోవడం తో బాలీవుడ్ వర్గాల్లో కూడా చర్చనీయాంశం
అయ్యింది.

సహజంగా ఈ స్థాయి రేటింగ్ కేవలం బాలీవుడ్ స్టార్
హీరోలకు మాత్రమే వస్తుంది. ప్రభాస్ కు ఆ రేటింగ్ నమోదు అవ్వడంతో ప్రభాస్
బాలీవుడ్ హీరోలకు ఏం తక్కువ కాదని మరోసారి నిరూపితం అయ్యిందంటూ ప్రభాస్
ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.Source link

Leave a Reply