సినీ ప్రముఖులకు శ్రీలంక డ్రగ్స్ రాకెట్ లింకులు

Movie NewsSandalwood Drugs Racket Case

కన్నడ సినిమా ఇండస్ట్రీని డ్రగ్స్ మూలాలు షేక్ చేస్తున్నాయి. ఇప్పటికే ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు రాగిణి సంజన అరెస్ట్ అయ్యారు. బెంగళూరులో డ్రగ్స్ ముఠాని  పట్టుకోవడం వెనుక శ్రీలంక డ్రగ్స్ రాకెట్ లింకులు ఉన్నాయని పోలీసులు తేల్చినట్టు సమాచారం.

హీరోయిన్ రాగిణి సంజనాలు అరెస్ట్ కావడం అనేది చిన్న పాయింటేనని.. అసలు టార్గెట్ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న రాజకీయ నేతలు వ్యాపారవేత్తలను పట్టుకోవడమేనని సమాచారం.

గత కొన్నేళ్లుగా శ్రీలంక రాజధాని కొలొంబోలో కాసినో వ్యాపారం బాగా పెరిగింది. ఆ కాసినో వ్యాపారంలో పెట్టుబడులు.. కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారివే అధికంగా ఉన్నాయని కేంద్ర నిఘా సంస్థలు గ్రహించినట్టు సమాచారం. అంతేకాదు.. వీటి కోసం కొలొంబో వెళ్లేదే ఎక్కువగా బెంగళూరు చెన్నై హైదరాబాద్ వారేనని తేలింది.

బెంగళూరు నుంచి కొలొంబో కాసినోలకు డ్రగ్స్ సప్లై బాగా జరుగుతోందని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్.సీ.బీ) గ్రహించింది. దాంతో ఏడాది కాలంగా నిఘా పెట్టారట..

ఈ క్రమంలోనే రాగిణి సంజనల అరెస్ట్ లు జరిగాయని.. వీరివెనుక ఉన్న పెద్ద తలకాయలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని తాజాగా కర్ణాటక హోంమంత్రి తెలిపారు. దీంతో కొలొంబో వెళ్లే అందరిపై ఇప్పుడు నిఘా కొనసాగుతోందని.. ఎక్కువగా టాలీవుడ్ శాండిల్ వుడ్ సినీ ప్రముఖులే కొలొంబో వెళుతారని తేలిందంట.. దీంతో అందరిలోనూ ఇప్పుడు వణుకు మొదలైంది.Source link

www.tupaki.com

Leave a Reply