సుశాంత్ ఇంట్లో పార్టీకి వచ్చింది సీఎం కొడుకే : కంగనా ట్వీట్Son of the CM came to the party at Sushant home

యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై హీరోయిన్ కంగనా రనౌత్ మొదటి
నుంచి కూడా తన స్వరం వినిపిస్తూనే ఉంది. బాలీవుడ్ లోని కొందరు ప్రముఖులు
మూవీ మాఫియాగా ఏర్పడ్డారని.. వారే సుశాంత్ కు ఎన్నో సమస్యలు సృష్టించి
మానసికంగా కృంగదీసి అతని కెరీర్ ను నాశనం చేశారని ఆరోపించింది. కంగనా టీమ్
అనే ట్విట్టర్ ఖాతా ద్వారా డైలీ సుశాంత్ సూసైడ్ ఇష్యూపై స్పందిస్తూ
వస్తోంది. ఈ క్రమంలో కంగనా రనౌత్ ముఖ్యమంత్రి కుమారుడి పేరుని
ప్రస్తావిస్తూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.

కాగా సుశాంత్
మరణించడానికి ముందు రోజు రాత్రి అతని ఇంట్లో పార్టీ జరిగిందని.. దానికి ఓ
ప్రముఖ రాజకీయ నాయకుడి కొడుకు కూడా హాజరయ్యారని బాలీవుడ్ మీడియాలో వార్తలు
వస్తున్నాయి. అయితే అతడి పేరును మాత్రం ఎవరూ రాయలేదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్
వివాదస్పద నటుడు కమల్ ఆర్ ఖాన్ ఈ విషయాన్ని తెలియజేస్తూ ”ఆ వ్యక్తి పేరు
రివీల్ ధైర్యం లేకపోతే దయచేసి చెప్పకండి. ధైర్యం ఉంటే ఆ పేరుని నాకు
చెప్పండి. ఆ తుర్రమ్ ఖాన్ ఎవరైనా సరే నేను ట్వీట్ చేస్తాను” అని
పేర్కొన్నాడు.

కంగనా రనౌత్ డిజిటల్ టీమ్ దీనిపై స్పందిస్తూ..
”అందరికీ తెలుసు. కానీ అతని పేరును ఎవరూ చెప్పరు. అతను కరణ్ జోహార్ యొక్క
బెస్ట్ ఫ్రెండ్. వరల్డ్ లోనే బెస్ట్ సీఎం యొక్క ఉత్తమ కుమారుడు. అతన్ని
‘బేబీ పెంగ్విన్’ అని ప్రేమగా పిలుస్తారు. ఒకవేళ నేను నా ఇంట్లో
ఉరివేసుకుని కనిపిస్తే దయచేసి నేను సూసైడ్ చేసుకున్నానని మాత్రం అనుకోకండని
కంగనా చెబుతోంది” అంటూ ట్వీట్ చేసారు. అయితే దీనికి నెటిజన్స్ మహారాష్ట్ర
సీఎం ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే అని కామెంట్స్ చేస్తున్నారు.Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *