సుశాంత్ డైరీ 2018 : ‘కృతి సనన్ తో గడపాలి.. స్మోకింగ్ చేయకూడదు’

Movie NewsSushant Diary 2018: 'should be spent with Kruthi Sanan .. No smoking'

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్
అనుమానాస్పద మృతి కేసులో ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చిన సంగతి
తెలిసిందే. ఈ క్రమంలో రోజులు గడిచే కొద్దీ సుశాంత్ సింగ్ జీవితానికి
సంబంధించిన అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిల్వర్ స్క్రీన్
పై ఇన్నాళ్లు అభిమానులను అలరించిన సుశాంత్ రియల్ లైఫ్ లో ఏమి జరిగిందో
తెలుసుకునే క్రమంలో మీడియా ఛానల్స్ అనేక విషయాలు వెల్లడిస్తున్నాయి. ఈ
నేపథ్యంలో రెండేళ్ల క్రితం తన డైలీ లైఫ్ గురించి సుశాంత్ సింగ్ తన
స్వహస్తాలతో రాసుకున్న 2018 డైరీని ఓ జాతీయ మీడియా ఛానల్ బయటకు
తీసుకొచ్చింది. ఈ డైరీ సుశాంత్ కు చెందిన ఫామ్ హౌస్ నుంచి బయటకు
వచ్చినట్లు తెలుస్తోంది. ఈ డైరీ ద్వారా సుశాంత్ జీవితంలోని కొన్ని విషయాలు
వెల్లడయ్యాయి.

కాగా సుశాంత్ తన డైరీలో కృతి సనన్ తో సరదాగా
సమయాన్ని గడపాలని.. ధూమపానం చేయకూడదని పేర్కొన్నాడు. ఏప్రిల్ 27 2018లో
తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకే నిద్రలేచి ఓ కప్పు టీతో తన
రోజువారీ జీవితాన్ని ప్రారంభించానని సుశాంత్ అందులో రాసుకొచ్చారు. ఇకపై
ధూమపానం చేయకూడదని.. టెన్నిస్ ఆడాలని.. కృతితో సమయాన్ని
గడపాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ కృతి అంటే కృతిసనన్ అని అర్థం
అవుతోంది. అప్పటికే సుశాంత్ – కృతిసనన్ కలిసి ‘రాబ్తా’ అనే మూవీలో
నటించారు. ఆ సమయంలోనే వీరు ప్రేమించుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.
సుశాంత్ మరణం తర్వాత కృతిసనన్ హార్ట్ బ్రేకప్ సింబల్ పెట్టి భావోద్వేగమైన
పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇంకా సుశాంత్ డైరీలో తన సోదరి ప్రియాంక
మరియు బావలతో కలిసి టూర్ కు వెళ్లాలనుకుంటున్నట్లు రాసుకున్నాడు. అలానే తన
వ్యక్తిగత వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు పలు
సందేశాలను కూడా సుశాంత్ తన డైరీలో రాసుకున్నాడు.Source link

www.tupaki.com

Leave a Reply