స్టైలిష్ స్టార్ స్టైలింగ్ వెనక షాడో

Movie NewsThe reason why the bunny is so stylish?

అల్లు అర్జున్ ప్రోఫెషనల్ గా ఎంత స్టైలిష్ గా కనిపిస్తాడో? రెగ్యులర్
లైఫ్ లోనూ అంతే స్టైలిష్ గా కనిపిస్తాడు. పెద్ద తెరపై బన్ని కాస్ట్యూమ్
సెలక్షన్ కి ఫిదా అవ్వని వారు ఉండరు. కేవలం దుస్తుల ఎంపిక మాత్రమే
కాదు.. బాడీ లాంగ్వేజ్ పరంగానూ బన్నిలో ఇన్ బిల్ట్ స్టైల్ ఇమిడి ఉంది.
అందుకే అతడు స్టైలిష్ స్టార్ అయ్యాడు. సందర్భం ఏదైనా.. క్యాజువల్
వేర్…డిజైనర్ వేర్ ఏది ధరించినా ప్రత్యేకంగా తన స్టైల్ ని ఎలివేట్
అయ్యేలా చూసుకుంటాడు. మరి ఆ స్టైలింగ్ వెనక గాడ్ ఎవరు? అంటే
ఆసక్తికర సంగతులే తెలిశాయి. అల్లు అర్జున్ పర్సనల్ స్టైలిస్ట్
హార్మన్ కౌర్ బన్నీ కి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ ను ఓ ఇంటర్వ్యూ లో
రివీల్ చేశారు.

బన్నీకి బ్లాక్ కలర్ అంటే బాగా ఇష్టం. ఆ రంగు
డిజైన్స్ ని ధరించడానికి ఎక్కుడగా ఇష్టపడతాడు. తనని బాగా
పరిశీలిస్తే.. ప్రతి ఎంపికలోనూ బ్లాక్ కలర్ కామన్ గా ఉంటుంది. ఆ
కలర్ బన్నీకి ఓ సెంటిమెంట్ గా మారిపోయింది. సినిమా ఓపెనింగ్ లకు
హాజరవ్వాలన్నా… ఇతర ఈవెంట్లకు విచ్చేసినా.. వేదిక ఏదైనా తన స్టైల్
ని బ్లాక్ లో ఎలివేట్ అయ్యేలా చూసుకుంటారట. బ్లాక్ కలర్ తన దృష్టిలో
ఒక బ్రాండ్. స్టైలింగ్ విషయం లో బన్నీ చాలా క్లారిటీగా ఉంటాడు.

తనకు
ఏ సమయంలో ఏది అవసరామో.. ఏది అనవసరమో.. చాలా క్లారిటీగా
తెలుసుకుంటాడు. బ్లాక్ డ్రెస్ ఏది ఇచ్చినా ఎంతో ఇష్టపడతారని హార్మన్
కౌర్ వెల్లడించారు. అయితే ఈ విషయంలో బన్నీకి స్ఫూర్తి ఎవరు? అంటే
మావయ్య మెగాస్టార్ చిరంజీకి స్ఫూర్తి అని తెలుస్తోంది. చిరుకి తెలుపు రంగు
అంటే ఇష్టం. ఎదుటివారు బ్లాక్ ధరించడం ఇష్టం. అందుకే బన్ని బ్లాక్ ని
ఎంపిక చేసుకుంటారన్నమాట. ఇక బన్ని ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో
నటిస్తున్న సంగతి తెలిసిందే. అటుపై ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో
గజిని 2 చేస్తున్నారన్న ప్రచారం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.
త్రివిక్రమ్ తో అల వైకుంఠపురములో సీక్వెల్ చేసే అవకాశం ఉందన్న
ప్రచారం సాగుతోంది.Source link

Leave a Reply