స్మార్ట్ బ్యాచిలర్ అమ్మాయికి ఇట్టే పడిపోయాడు!

Movie NewsAkhil Joins On Sets Of Most Eligible Bachelor

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే తొలిగా గుర్తుకొచ్చే పేరు సల్మాన్ ఖాన్. బాలీవుడ్ వరకూ ఆయనే బ్యాచిలర్ సంఘం అధ్యక్షుడు. ఇక ఇటు టాలీవుడ్ వరకూ వస్తే ఇటీవలే వరుసగా మూడు నాలుగు బ్యాచిలర్ వికెట్లు నేలకూలాయి. ఇక ఇప్పటికీ ఇక్కడ డార్లింగ్ ప్రభాస్ నే సీనియర్ బ్యాచిలర్ గా పరిగణించి అసోసియేషన్ అధ్యక్షుడిగా గౌరవిస్తున్నారు. ఇక యువతకు దిశానిర్ధేశనం చేసేది ప్రభాసే.

అదంతా సరే కానీ.. బ్యాచిలర్స్ టీమ్ లో చురుకైన యువకుడు అఖిల్ ప్రస్తుతం అదే టైటిల్ తో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ బ్యాచిలర్ సక్సెస్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఇక అఖిల్ సరసన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`లో బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుండడంతో ఒకటే ఆసక్తి నెలకొంది.  అందమైన అమ్మాయికి పడిపోని బ్యాచిలర్ ఎవరైనా ఉంటారా? ఇదిగో ఇక్కడ సీన్ చూస్తుంటే అలా అఖిల్ అనే బ్యాచిలర్ కూడా బుక్కయిపోయాడనే అర్థమవుతోంది.

ఈ వారం ప్రారంభంలో పూజా హెగ్డే ముంబై నుండి హైదరాబాద్ లో దిగిందిట. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రీకరణలోనూ పాల్గొంటోంది. పూజా – అఖిల్ జోడీపై సీన్లు తీస్తున్నారట. జీఏ2 సంస్థ ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలతో షూటింగ్ శరవేగంతో జరుగుతోందని తెలిపారు.

“@ అఖిల్అక్కినేని – హెగ్డెపూజా #MostEligibleBachelor సెట్స్ కి తిరిగి వచ్చారు. ఫిల్మ్ షూట్ ప్రభుత్వం నిర్దేశించిన అన్ని భద్రతా మార్గదర్శకాలతో పాటు అన్ని ముందు జాగ్రత్త చర్యలతో తెరకెక్కుతోంది“ అని జిఎ 2 పిక్చర్స్ బ్యానర్ ట్వీట్ చేసింది. ఈ చిత్రానికి ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.Source link

www.tupaki.com

Leave a Reply