హరీష్ శంకర్ పంచ్ ఫేక్ కలెక్షన్ల పైనేనా?

Movie Newsదర్శకుడు హరీష్ శంకర్ మాస్ ఎంటర్టైనర్లను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్
మాత్రమే కాదు.. కొన్ని వివాదాస్పద విషయాలపై మాట్లాడి వివాదాలకు
కేంద్రబిందువు కావడంలో కూడా స్పెషలిస్టే. మిగతా దర్శకుల లాగా కాకుండా
లౌక్యం అనే పదానికి హరీష్ చాలా దూరంగా ఉంటారు . తాజాగా హరీష్ తన ట్విట్టర్
ఖాతా ద్వారా చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

హరీష్
తన ట్విట్టర్ ఖాతా ద్వారా “నేనూ గెలవాలి ….All the Best నేను గెలవాలి
…. Ok….. నేనే గెలవాలి …. Sorry Boss….” అంటూ ట్వీట్ చేశారు. ఈ
ట్వీట్ సంక్రాంతి సినిమాల ఫేక్ కలెక్షన్లను ఉద్దేశించి వేసిన సెటైర్ అని
ఎక్కువ మందికి అర్థం అయింది. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ పంచ్ మహేష్
బాబు సినిమా పై అనుకున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సెటైర్ అల్లు అర్జున్
సినిమా పై అనుకున్నారు. ఆ ట్వీట్ కింద కామెంట్ల లో ఒకరిని ఒకరు
తిట్టుకోవడం మొదలు పెట్టారు. కొందరేమో ఈ ట్వీట్ ఏపీ రాజకీయాల గురించి అంటూ
మేథావుల తరహాలో తీర్మానించారు. ఒక నెటిజన్ “ఈ ట్వీట్లు సరే నీ కొత్త
సినిమా సంగతి చెప్పు బాసు” అని చిరాకు పడ్డారు. మరో నెటిజన్ “నెక్స్ట్
సినిమా అఖిల్ తో అంటున్నారు.. నిజమేనా?” అని ప్రశ్నించాడు.

ఏదైతేనేం..
ఒకటి మాత్రం నిజం. హరీష్ శంకర్ ట్వీట్ ఒక హాట్ టాపిక్ గా మారింది. ఆ
ట్వీట్ కాస్త స్పష్టంగా వివాదాల గురుడు ఆర్జీవీ తరహాలో పెట్టేస్తే
అందరికీ అర్థం అవుతుంది కదా. ఇలా తప్పుగా అర్థం చేసుకుని తన్నుకు చచ్చేపని
నెటిజన్లకు ఉండదు కదా అనే అభిప్రాయం వినిపిస్తోంది. గబ్బర్ సింగ్ డైరెక్టర్
దీనికి ఏమంటారో మరి!Source link

Leave a Reply