హీరో బెడ్ మీదికి వస్తేనే 2నిమిషాల పాత్రలు ఐటెం నంబర్లు!- కంగన

Movie NewsKangana Ranaut Shocking Comments On Bollywood Heroes

క్వీన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. బాలీవుడ్ తనకు ఇచ్చిన రెండు నిమిషాల పాత్రలు.. ఐటమ్ నంబర్లు .. శృంగార సన్నివేశం – అది కూడా ఒక హీరోతో పక్క పంచుకోవడం వల్లనే దక్కినవని బహిరంగంగా ప్రకటించి షాకిచ్చారు.

ప్రముఖ నటి.. సమాజ్ వాదీ పార్టీ ఎంపి జయా బచ్చన్ ఇటీవల పార్లమెంటు ప్రసంగంలో.. సినీ పరిశ్రమను దుర్భాషలాడటం ద్వారా ప్రజలను దెబ్బతీస్తున్నారని విమర్శించిన తరువాత కంగన పైవిధంగా స్పందించారు. “ఇండస్ట్రీ నాకు 2 నిమిషాల పాత్రలు హీరోతో నిద్రించిన తర్వాత ఐటెమ్ నంబర్లను ఇచ్చింది“ అని కంగనా చెప్పారు.

జయ బచ్చన్ పార్లమెంటరీ ప్రసంగంపై స్పందించిన కంగన ఇలా ట్వీట్ చేశారు. “కౌన్ సి థాలి డి హై జయ జి ఉర్ అన్ కి ఇండస్ట్రీ నే?“ .. ఐటెమ్ నంబర్లు.. శృంగార సన్నివేశం అది కూడా హీరోతో సుఖిస్తేనే..! బదులుగా అవకాశాలొచ్చాయి. నేను పరిశ్రమ స్త్రీవాదాన్ని నేర్పించాను. ఇది నా స్వంత ప్లేట్ జయాజీ.. మీది కాదు“ అంటూ కంగన విరుచుకుపడింది. ప్రస్తుతం కంగన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.

బాలీవుడ్ లో 99 శాతం మంది మాదకద్రవ్యాలను వినియోగిస్తున్నారని కంగనా ఇదివరకూ ఆరోపించిన సంగతి విధితమే. వారంతా క్లీన్ గా ఉన్నారని నిరూపించడానికి రక్త పరీక్షలు చేయమని టాప్ స్టార్స్ రణవీర్ సింగ్- రణబీర్ కపూర్ – విక్కీ కౌషల్ .. దర్శకుడు అయాన్ ముఖర్జీ వంటి వారి పేర్లను కంగన బయటపెట్టడం సంచలనమైంది.Source link

www.tupaki.com

Leave a Reply