హైదరాబాద్ లో అపార్ట్ మెంట్లు కొనుక్కున్న టాప్ హీరోయిన్స్

Movie NewsTop heroines who bought apartments in Hyderabad

ముంబై సహా మెట్రో నగరాల నుంచి టాలీవుడ్ కి వచ్చి స్థిరపడే కథానాయికల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇరుగు పొరుగు భాషల భామలు ఇక్కడ హవా సాగించాక భారీ పారితోషికాలు అందుకుంటూ సొంత ఫ్లాట్లు కొనుక్కోవడం రివాజు. రియల్ వెంచర్లు .. అపార్ట్ మెంట్లలోనే పెట్టుబడులు పెట్టే యాంకర్లు హీరోయిన్లకు ఇక్కడ కొదవేమీ లేదు. పలువురు అగ్ర కథానాయికలు రాజధానిలో సొంత అపార్ట్ మెంట్లు కొనుక్కుని స్థిరపడడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.

స్వీటీ అనుష్క శెట్టి మొదలు సమంత.. రాశీ ఖన్నా.. రకుల్ వరకూ హైదరాబాద్ లో సెటిలైనవారే. అనుష్క ఒక్క హైదరాబాద్ లోనే మూడు నాలుగు ఫ్లాట్లు విల్లాలు కొన్నారని చెబుతుంటారు. జూబ్లీహిల్స్ లోని ఆంధ్రజ్యోతి పరిసరాల్లో అనుష్కకు ఓ భవంతి ఉంటే అప్పట్లో అమ్మేసి వేరొక చోట కొనుక్కున్నారని గుసగుసలు వినిపించాయి. ఇక అక్కినేని కోడలు సమంత విరివిగా సొంత ఫ్లాట్లపై పెట్టుబడులు పెట్టడంపై కథనాలొచ్చాయి. అనుష్క ..  సామ్ లకు ఇంతకుముందు పారితోషికంతో పాటు అపార్ట్ మెంట్లు కానుకలు అందాయని గుసగుసలు వినిపించాయి. ప్రస్తుతం హబ్బీ నాగ చైతన్య తో కలిసి సమంత గచ్చిబౌళి లో ఖరీదైన భవంతి లో టాప్ ఫ్లోర్ లో అపార్ట్ మెంట్ కొనుక్కుని అందు లో నివశిస్తున్నారు.

సమంత తర్వాత రాశి ఖన్నా.. రకుల్ ప్రీత్ హైదరాబాద్ లో సొంత ఇళ్లను కొనుక్కుని స్థిర పడ్డారు. ఖరీదైన ట్రిపుల్ బెడ్ రూమ్ లపై పెట్టుబడులు పెట్టారు. అనుష్క సమంత లాంటి స్టార్ హీరోయిన్లు చాలా కాలం క్రితమే హైదరాబాద్ లో సెటిలయ్యారు. ఇక్కడ నిరంతరం వీళ్లు సినిమాలతో బిజీ బిజీ. అటు ముంబై చెన్నయ్ తో కనెక్షన్ ఉన్నా ఇక్కడ హైదరాబాద్ లో ఉండేందుకే ఇష్టపడే భామలుగా రకుల్ .. రాశీ ఖన్నా పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. ఆ ఇద్దరూ ఇప్పటికే సొంత పెట్టుబడుల తో రాజధాని నగరం లో దూసుకు పోతున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా కు ఇక్కడ అస్సెట్స్ ఉన్నాయన్న గుసగుసలు వినిపించాయి.

తాజాగా వీళ్ల బాటలోనే కన్నడ బ్యూటీ రష్మిక మందన హైదరాబాద్ లో సెటిలవుతోందని సమాచారం. ఇక్కడ ఇటీవలే గచ్చిబౌళి లో 3 బిహెచ్ కె ఫ్లాట్ ను కొనుగోలు చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పంజాబీ బ్యూటీ ఛార్మి కౌర్ .. అలానే డెహ్రా డూన్ బ్యూటీ లావణ్య త్రిపాఠి కూడా హైదరాబాద్ లో సొంత అపార్ట్ మెంట్లు కొనుక్కుని స్థిర పడ్డారన్న సమాచారం ఉంది. నవతరం నాయిక పంజాబీ బిడ్డ మెహ్రీన్ కూడా హైదరాబాద్ లో అపార్ట్ మెంట్ కొనుక్కుందన్న గుసగుసలు ఇటీవల వినిపించాయి.Source link

www.tupaki.com

Leave a Reply