CHIRU 152.. యంగర్ వెర్షన్ చేసేదెవరు?



Ram Charan to start shooting for Chiru 152 in April

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 152వ చిత్రం షూటింగ్
శరవేగంగా జరుగుతోంది. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం
వహిస్తున్నారు. త్రిష కథానాయిక. `ఆచార్య` అనే టైటిల్ ఫిలింఛాంబర్ లో
రిజిస్టర్ అయిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ ఆచార్య పాత్రలో మెరుపులు
మెరిపిస్తారన్న టాక్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఛరిష్మా.. కొరటాల
సక్సెస్ ట్రాక్ దృష్ట్యా ఈ సినిమాపైనా భారీ అంచనాలేర్పడ్డాయి.
మెగాస్టార్ అభిమానిగా ఈ సినిమా చేస్తున్నానని కొరటాల ఇంతకు ముందు
చెప్పడం ఆసక్తికరం. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది. 99
రోజుల్లో షూటింగ్ పూర్తిచేయాలని మెగాస్టార్ డైడెలైన్ పెట్టారు
కాబట్టి..ఆ టైమ్ లోగానే షూటింగ్ ని చకచకా పూర్తి చేసే పనిలో ఉన్నారు.

అయితే
ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ చిన్న పాత్ర
పోషిస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. తెరపై కనిపించినంత సేపూ ఆ పాత్ర
హైలైట్ గా ఉంటుందిట. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన మరో ఆసక్తికర అప్
డేట్ అందింది. ఇందులో చరణ్ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రంగ ప్రవేశం
చేస్తారట. చిరుకి యంగర్ వెర్షన్ లో కనిపించనున్నాడుట. ఆ పాత్ర పేరు
సిద్దు. దాదాపు 25 నిమిషాల పాటు ఆ పాత్ర రక్తి కట్టిస్తుందని
చెబుతున్నారు.

సినిమా ఆద్యంతంచిరంజీవి కనిపిస్తే..ఆ 25 నిమిషాల
పాటు చరణ్ పాత్ర మరో హైలైట్ గా ఉంటుందని అంటున్నారు. చిరు వర్సెస్
చరణ్ అనేంతగా పోటీ పడి నటించేందుకు ఆస్కారం ఉందట. చరణ్ కు
హీరోయిన్ ఉంటుందా.. ఉండదా? అన్నది తెలియాల్సి ఉంది. చిరంజీవికి జోడీగా
త్రిష నటిస్తోంది. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ -కొణిదెల ప్రొడక్షన్
కంపెనీ సంయుక్తం గా నిర్మిస్తున్నాయి.



Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *