PSPK 26 టైటిల్ పై జ్యోతిష్యుల కిరికిరి



Astrologer shrugs on PSPK 26 title

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్
దర్శకత్వంలో పింక్ రీమేక్ `లాయర్ సాబ్`(PSPK 26 ) సెట్స్ పై ఉన్న
సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయింది. యూనిట్ రెండవ
షెడ్యూల్ కి రెడీ అవుతోంది. పవన్ పొలికల్ టూర్ పూర్తవ్వగానే తిరిగి
షూటింగ్ లో పాల్గొంటారు. ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఖరారవ్వాల్సి ఉంది.
లాయర్ సాబ్….వకీల్ సాబ్ అంటూ రెండు టైటిల్స్ ప్రచారం లోకి వచ్చాయి.
వీటిలో ఫిలిం ఛాంబర్ లో వకీల్ సాబ్ ని రిజిస్టర్ చేసారు. దీంతో టైటిల్
పరమైన కన్ఫ్యూజన్ నెలకొంది. వకీల్ సాబ్ నే ఫైనల్ చేశారని లాయర్
సాబ్ అనేది వర్కింగ్ టైటిల్ మాత్రమేనని ఇంతకు ముందు ప్రచారమైంది. ఆ
తర్వాతా లాయర్ సాబ్ నే అసలు టైటిల్ అంటూ మరో ప్రచారం కన్ఫ్యూజ్
చేసింది. ఇలా రకరకా భిన్న కథనాల నడుమ పవన్ 26 టైటిల్ సస్పెన్స్
కొనసాగుతోంది.

తాజాగా PSPK 26 టైటిల్ పై మరో ఇంట్రెస్టింగ్ అప్
డేట్ అందింది. పవన్ కళ్యాణ్ లాయర్ సాబ్ టైటిల్ కే ఒకే చెప్పారట.
దీనికి ఓ బలమైన కారణం కూడా ఉందని తెలుస్తోంది. పవన్ విశ్వసించే
రెగ్యులర్ జ్యోతిష్యులు `లాయర్ సాబ్` టైటిల్ అయితేనే కలిసొస్తుందని..
దానినే టైటిల్ గా ఫిక్స్ చేయమని సూచించారుట. వకీల్ సాబ్ అనేది పవన్
పేరు బలాన్ని బట్టి ఏమాత్రం బాగా లేదని…ఆ టైటిల్ పెడితే గానీ
కలిసిరాదని కరాఖండీ గా చెప్పేసారుట. దాంతో `లాయర్ సాబ్` నే పవన్
ఫిక్స్ చేయండని చిత్ర బృందానికి సూచించారట.

అయితే చిత్ర
నిర్మాత దిల్ రాజు మాత్రం `వకీల్ సాబ్` అయితేనే బాగుంటందని పవన్ ని
కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారట. కానీ పవన్ అందుకు ససేమీరా
అనేస్తున్నారని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ భక్తి..
ధ్యానం నమ్మకాల గురించి తెలిసిందే. స్వామీజీలు.. జ్యోతిష్యుల్ని ఆయన
గౌరవిస్తారు.. బలంగా నమ్ముతారు. అందుకే పీఎస్ పీకే 26 టైటిల్ `లాయర్
సాబ్` అని ఫిక్స్ అవ్వాల్సిందే!



Source link

Avatar

CineDhol

Latest Telugu Cinema News, Updates, Movie Reviews, Trailers, Teasers, VIdeos, Collections and Photo Galleries

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *